Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిజె టిల్లు కోసం అనిరుద్ ఆల‌పించిన పటాస్ పిల్లకు ఆద‌ర‌ణ‌

డిజె టిల్లు కోసం  అనిరుద్ ఆల‌పించిన పటాస్ పిల్లకు ఆద‌ర‌ణ‌
, సోమవారం, 24 జనవరి 2022 (17:22 IST)
Sidhu Jonnalagadda, Neha Shetty
ఇటీవల విడుదల అయిన "లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల,  గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతున్న  నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన మరో గీతం ఈ రోజు విడుదల అయింది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే.....
"రాజ రాజ ఐటం రాజ  రోజ రోజ క్రేజీ రోజ పటాస్ పిల్ల పటాస్ పిల్ల" అనే సాహిత్యం తో కూడిన ఈ గీతానికి చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. కిట్టు విస్సా ప్రగడ అందించిన సాహిత్యానికి, సంగీత దర్శకుడు గాయకుడు అయిన అనిరుద్ రవిచందర్ గాత్రాన్ని అందించారు. 
 
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ల పై చిత్రీకరించిన ఈ గీతానికి విజయ్ బిన్ని నృత్యాలను సమకూర్చారు.  సాహిత్యం, స్వరం పోటీ పడిన ఈ పాటకు  సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. 
ఈ సందర్భంగా గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ...‘శ్రీ చరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా‘ అనే పదం తట్టింది. అదే మాట దర్శకుడి తో పాటూ అందరికీ నచ్చింది. తర్వాత దర్శకుడి దగ్గర పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకుంటూ వచ్చాను.  పాట లో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్ కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయి కి వెళ్తుందని నమ్మకం కలిగింది. టీం అందరికీ పాట నచ్చటం తో విడుదల అయ్యాక జనానికి కూడా బాగా నచ్చుతుంది అనే నమ్మకం తో ఉన్నాను! అన్నారు ఆయన. పాటలోని దృశ్యాలు అన్నీ యువతను ఆకట్టుకునేవిగానే ఉన్నాయి. 
 
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన'డిజె టిల్లు' టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. విడుదలైన డిజె టిల్లు గీతం కూడా సంగీతాభిమానులకు ఎంతగానో చేరువ అయింది. వినోదమే ప్రధానంగా త్వరలోనే విడుదల అవుతున్న 'డిజె టిల్లు' ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. 
వినోద ప్రధానంగా సాగే కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఈ చిత్రానికి దర్శకుడు అయిన విమల్ కృష్ణ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నింటికీ క‌లిపి కోటి తీసుకున్న‌ నిది అగ‌ర్వాల్‌