Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాభై ఏళ్ళు నేను చేసిందే రైట్ అనుకున్నా కానీ రాంగ్ అన్న‌వారు వున్నారు - సాయికుమార్‌

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (16:10 IST)
Saikumar, Viraj Ashwin, Poojitha Ponnada and others
విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `జోరుగా హుషారుగా`. శిఖ‌ర అండ్‌ అక్ష‌ర ఆర్ట్స్ బేన‌ర్‌పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తొలి ప్ర‌చార చిత్రం ఆవిష్క‌ర‌ణ శ‌నివారం రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ `జోరుగా హుషారుగా` చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను  ఆవిష్క‌రించారు. 
 
అనంత‌రం సాయికుమార్ మాట్లాడుతూ, టైటిల్ త‌గిన‌ట్లుగా హుషారైన టీమ్‌తో ప‌ని చేశాను. ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పం చేశాక కొత్త ద‌ర్శ‌కులు భిన్నంగా ఆలోచిస్తూ పాత్ర‌లు ఇస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ఇందులో బాగా చూపించారు. విరాజ్‌ను ఓటీటీలో చూశాక బాగా చేశాడ‌నిపించింది. త‌ను మార్తాండ్ కె.వెంక‌టేష్ మేన‌ల్లుడు అని తెలిశాక ఆనందం క‌లిగింది. రోహిణి నా భార్య‌గా న‌టించింది. మ‌ధునంద‌న్ చ‌క్క‌టి పాత్ర చేశాడు. ప్ర‌ణీత్ చేపిన పాట‌లు విన్నాను. చాలా బాగున్నాయి. ఈ చిత్రం చూస్తే, మ‌న ప‌క్కింటి క‌థ‌లా వుంటుంది. బంధాలు, అనుబంధాలు,  ఫ్రెండ్‌షిప్‌తోపాటు వ్య‌క్తి జీవ‌న‌పోరాటం వంటి అంశాలు ఇందులో వుంటాయి. మేకింగ్‌, విజువ‌ల్స్ బాగా క‌నిపిస్తాయి. నేను యాభైఏళ్ళుగా న‌టిస్తున్నా నేను చేసిందే రైట్ అనుకునేవాడిని. కానీ ఒక్కోసారి నాది రాంగ్ అని కూడా చెప్పే ద‌ర్శ‌కులు ఇప్పుడు వున్నారు. అలాంటి కొత్త త‌రంతో న్యూ ట్రెండీ ఫిలిం సినిమా ఇది` అని తెలిపారు.
 
ద‌ర్శ‌కుడు అనుప్ర‌సాద్ తెలుపుతూ, ఇది నా తొలి సినిమా. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించాం.  మ్యూజిక్ ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ ద్వారా క‌థ‌ను నిర్మాత‌కు వినిపించాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది.. నేను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు వ‌చ్చేలా నిర్మాత స‌హ‌క‌రించారు. షూటింగ్ పూర్త‌యి ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుపుకుంటోంది. సాయికుమార్‌గారు మా సినిమాకు అండ‌గా నిలిచారు.  రెండు నెల‌ల‌లో సినిమాను విడుద‌ల చేయ‌నున్నామ‌ని తెలిపారు.
 
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, కోవిడ్ టైంలో సినిమా మొద‌లు పెట్టాం. క‌ష్ట‌మైన వాతావ‌ర‌ణంలో కూడా నిర్మాత చాలా స‌హ‌క‌రించారు. ద‌ర్శ‌కులు కొత్త‌వారైనా స్క్రిప్ట్ చ‌క్క‌గా రాసుకున్నారు. ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపిస్తాను. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ క‌థ‌. స‌హ‌న‌టులు పూజిత‌, సోను, క్రేజీ ఖ‌న్నా, మ‌ధునంద‌న్  చాలా చ‌క్క‌గా న‌టించారని తెలిపారు.
 
హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ, లాక్‌డౌన్ త‌ర్వాత ఈ సినిమా షూట్ జ‌రిగింది. ఇది చాలా ఫ‌న్ ఫిలిం. టైటిల్‌లోనే హుషారు వున్న‌ట్లుగా మేమంతా అలా న‌టించాం. ద‌ర్శ‌కుడు క‌థ బాగా రాసుకున్నారు. ఇందులో ఎమోష‌న్స్ బాగా పండాయి. పాట‌లు, సంగీతం బాగా కుదిరింద‌ని అన్నారు. 
 
న‌టుడు మ‌ధునంద‌న్ తెలుపుతూ, క‌రోనా టైంలో మాకు ప‌నిలేన‌ప్పుడు ప‌ని క‌ల్పించారు నిర్మాత‌. ద‌ర్శ‌కుడు షాట్ ఫిలిం చేసిన త‌ర్వాత ఈ సినిమా చేశాడు.  క‌థ‌పై ఆయ‌న‌కు మంచి ప‌ట్టువుంది. ఆయ‌న మా నుంచి  న‌ట‌న రాబ‌ట్టుకున్నారని తెలిపారు.
 
నిర్మాత నిరీశ్ తిరువీదుల మాట్లాడుతూ, అంద‌రి కృషితో సినిమా బాగా వ‌చ్చింది. సుద్దాల అశోక్‌తేజ, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, పూర్ణాచారి మంచి సాహిత్యం రాశారు. ఫేమ‌స్ గాయ‌నీ గాయ‌కుల‌తో పాట‌లు పాడించాం. మంచి లొకేష‌న్‌లో తీశాం. ద‌ర్శ‌కుడిలో క్లారిటీ వుంది. మొద‌ట్లో త‌ను ఏదైతే చెప్పాడో అది నేను స్కీన్‌పై చూశాను. హీరోకు క‌థ చెప్ప‌గానే వెంట‌నే అంగీక‌రించాడు. పోస్ట‌ర్‌లో చూపిన‌ట్లుగా త‌నే అంద‌రినీ భుజాల‌పై మోసేలా పాత్ర వుంటుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌రలో విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments