Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటున్న 'మరువ తరమా' ఫస్ట్ లుక్ పోస్టర్

Webdunia
బుధవారం, 3 మే 2023 (17:45 IST)
Maruva Tarama
ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ లో ఉన్న ఆ ఫీల్ యూత్ మెప్పు పొందుతూ ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ తో నడిచే ఫీల్ గుడ్ సినిమాలకు యూత్ పట్టం కడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో స్టోరీస్ బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. 
 
ఇదే బాటలో ఇప్పుడు మరో ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'మరువ తరమా'  రాబోతోంది. అద్వైత్ ధనుంజయ  హీరోగా  అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. 
 
ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతున్న 'మరువ తరమా' చిత్ర యూనిట్.. ఇప్పటికే టైటిల్ లుక్ రిలీజ్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇదే జోష్ లో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రేమలో ఉన్న కుర్రాడి ఫీలింగ్స్ తెలిసేలా ఉన్న ఈ పోస్టర్ తొలి చూపులోనే యూత్ ఆడియన్స్ మనసు దోచేసేలా ఉంది. పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ హైలైట్ గా నిలిచింది. 
 
ఈ ఏడాదిలో ప్రేమను నింపేందుకు మరువ తరమా అనే చిత్రం రాబోతోందని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేసి భేష్ అనిపించుకున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టు మేకర్లు తెలిపారు. ఈ సినిమాలోని తొలి పాటను మే 5న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
 
ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందించారు. రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. అద్వైత్ ధనుంజయ , అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ముఖ్య పాత్రల్లో నటించారు. 
 
సాంకేతిక బృందం
 
నిర్మాతలు : గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు
బ్యానర్ : సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్
దర్శకత్వం : చైతన్య వర్మ నడింపల్లి
ఎడిటర్ : కె.ఎస్.ఆర్
కెమెరామెన్ :  రుద్ర సాయి 
సంగీతం : విజయ్ బుల్గనిన్
కొరియోగ్రఫర్ : అజయ్ శివ శంకర్
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments