Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నక్షత్రం పేరు 'సుశాంత్' ... ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరవాలి!!

Sushant Singh Rajput
Webdunia
సోమవారం, 6 జులై 2020 (18:44 IST)
బాలీవుడు యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. సినీ ఇండస్ట్రీలోని బంధుప్రీతి (నెపోటిజం) కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ యువ హీరో మృతిపట్ల బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సుశాంత్ వీరాభిమాని ఒకరు ఓ నక్షత్రాన్ని కొనుగోలు చేసి, దానికి సుశాంత్ అని నామకరణం చేశాడు. పైగా, "ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరవాలి" అంటూ ట్వీట్ చేశారు. 
 
సుశాంత్‌ ఇష్టాలు తెలిసిన ఒక అభిమాని ఆయనకు గొప్పగా నివాళి ప్రకటించారు. అమెరికాకు చెందిన రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్‌ పేరు పెట్టారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 
 
'సుశాంత్‌ అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు. ఆయన మరింతగా మెరవాలి. ఆయన పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి' అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు. 
 
విశ్వంలో ఉండే తారల్లో ఒకటైన ఆర్ఏ 22.121కు జూన్ 25,2020 నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళశాస్త్ర సంస్థ మాకు హక్కులు కల్పించింది. ఆ తారకు సంబంధించిన హక్కులు, కాపీరైట్స్ మాకు లభించాయి అని కూడా రక్ష పేర్కొన్నారు. చంద్రమండలంపై కూడా సుశాంత్‌ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments