Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (17:51 IST)
Mohan jee
ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జి గురువారం రాత్రి కరోనా తో కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు మాది రెడ్డి కృష్ణమోహన్ రావు.1935లో గుంటూరులో పుట్టారు. వాళ్ల నాన్న కృష్ణారావు విజయవాడలో శ్రీకాంత్ పిక్చర్స్ పంపిణీ సంస్థ లో మేనేజర్ గా పనిచేసేవారు. తర్వాత వీళ్ళ కుటుంబం చెన్నై కి షిఫ్ట్ అయింది. తమ్ముడు జగన్ మోహన్ రావు తో కలసి మోహన్ జీ జగన్ జీ పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేయడం ప్రారంభించారు. 
 
ఎన్టీఆర్ నటించిన `కాడే ద్దులు ఎకరం నేల.. వీరి తొలి చిత్రం. అప్పటి నుండి 900 చిత్రాలకు ఈ సోదరులు పని చేశారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. ఆయన తొలి సినిమా తాత మనవడు నుండి ఒరేయ్ రిక్షా వరకూ వంద సినిమాలకు పని చేశారు.  ఎన్టీఆర్, ఏ యాన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు, మురళీ మోహన్ చిత్రాలకే కాకుండా కన్నడం లో రాజ్ కుమార్, విష్ణు వర్ధన్, తమిళంలో జెమినీ గణేషన్, రజనీకాంత్ చిత్రాలకు కూడా పని చేశారు.
ఈ సోదరులలో చిన్నవాడైన జగన్ మోహన్ కొంత కాలం క్రితం కన్ను మూశారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments