Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ స్టార్ ను ప్రైమ్ వీడియోలో ఎంజాయ్ చేస్తున్న ఆడియెన్స్

డీవీ
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (10:39 IST)
Family star poster
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్" రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ వాళ్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ ఫర్ ఫార్మెన్స్ బాగుందని, హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటూ వారు పోస్ట్స్ చేస్తున్నారు. 
 
కొందరు కావాలని చేసిన నెగిటివ్ ప్రచారంలోనూ విజయ్ క్రేజ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments