సోషల్ మీడియా ద్వారా దిల్ రాజు కోరిక నెరవేనా?
, గురువారం, 11 ఏప్రియల్ 2024 (16:49 IST)
ఇటీవల తెలుగు సినిమారంగంలో పలు మార్పులు జరుగుతున్నాయి. ఉత్తరాది మీడియాను ఆదర్శంగా తీసుకుని కొత్తపోకడలతో డిజిటల్ ఫార్మెట్ తో మీడియా ఎక్కువైంది. వెబ్‌సైట్స్, సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రసార, సమాచారం రంగంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో య్యూటూబర్స్ అనేది కొత్త ప్రక్రియ. ఎవరైనా ఫోన్ వుంటే.. తమ అభిప్రాయాలు పెట్టుకోవచ్చు. అలా ఈమధ్య కొన్ని సినిమాలపై విమర్శలు ఎక్కువగా సంధించారు. గతంలో కొన్ని సినిమాలకు జరిగినా ఈసారి ఫ్యామిలీ స్టార్ సినిమాకు బాగా జరిగాయి. దిల్ రాజు నిర్మాత కావడంతో పాటు విజయ్ దేవరకొండ వ్యక్తిగత ప్రవర్తన కారణంగా వుందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకుముందు సినిమా ప్రమోషన్ లో నిర్మాత దిల్ రాజు సినిమా గురించి పెద్దగా ప్రచారం చేశారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న డిజిటల్ మీడియాకు చెందిన కొందరు విజయ్ దేవరకొండ వ్యక్తిగత క్యారెక్టర్ గురించి ప్రశ్నించాడు. దానికి ఆయన గతంలోనే దీనికి గురించి క్లారిటీ ఇచ్చానంటూ... ఇటీవలే ప్రమోషన్ లో బాగంగా మెగాస్టార్ చిరంజీవిగారు కూడా నువ్వు నీలా వుంటూ.. వ్యక్తిత్వాన్ని మార్చుకోకు.. అని సూచించారని తెలిపారు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయన సినిమాపై విపరీతమైన కాంట్రవర్సీ వచ్చింది.
ఈ విమర్శలపై నిర్మాత దిల్ రాజు కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఇలా ఎందుకు రాస్తున్నారంటూ స్పందించారు. విశేషం ఏమంటే...అలాంటి వారితో ఏర్పాటు అయిన కొత్త అసోసియేషన్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం.
అనంతరం ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సినీ జర్నలిస్టులు, సినిమా పరిశ్రమ ఓ కుటుంబంలా ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే టీఎఫ్‌జేఏకు అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని నూతనంగా ఎంపికైన అసోసియేషన్‌కు ఉంటుంది. జవాబుదారీతనం లక్ష్యంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. మరి డిజిటల్ మీడియా జవాబుదారీ తనం ఉండేలా చేస్తారో లేదో చూడాలి అని విశ్లేషకులు అంటున్నారు.
తర్వాతి కథనం