నవ్వుల పువ్వులతో పాటు కాసుల వర్షం కురిపిస్తున్న "ఎఫ్-2"

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (13:23 IST)
ఈ యేడాది టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలు మూడు. ఒకటి బాలకృష్ణ హీరోగా నటించిన "ఎన్టీఆర్ కథానాయకుడు". రెండోది రామ్ చరణ్ హీరోగా వచ్చిన "వినయ విధేయ రామ". మూడోది వెంకటేష్ - వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). ఈ మూడు చిత్రాలు ఒకటి రెండు రోజుల వ్యవధిలో రిలీజ్ అయ్యాయి.
 
అయితే, జనవరి 12వ తేదీన విడుదలైన "ఎఫ్-2" మాత్రం మిగిలిన రెండు చిత్రాల కంటే మంచి మార్కులు కొట్టేసింది. పూర్తి ఫ్యామిలీ, హాస్యభరితంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. నిజానికి రెండు భారీ బడ్జెట్ చిత్రాల మధ్య 'ఎఫ్-2' చిత్రాన్ని విడుదల చేయడం పెద్ద సాహసంతో కూడుకున్న పనే. కానీ, ఈ చిత్రం మాత్రం మిగిలిన రెండు చిత్రాల కంటే మంచి టాక్‌తో కనకవర్షం కురిపిస్తోంది. విడుదలైన ప్రతి చోటా మంచి వసూళ్లు వస్తున్నాయి. 
 
ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల కంటే.. ఐదో రోజునే మంచి వసూళ్లు రాబట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. తొలి 4 రోజుల్లో రూ.25.8 కోట్ల షేర్‌ను సాధించిన ఈ సినిమా, 5వ రోజున రూ.6.5 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. అలాగే, 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.41.6 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇక ఈ వారాంతంలో కొత్తగా వచ్చే సినిమాలేవీ లేకపోవడంతో మున్ముందు ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments