Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంక్రాంతి అల్లుళ్ళు (ఎఫ్2 16 డేస్ రిపోర్ట్)

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (14:31 IST)
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు జంటగా నటించిన చిత్రం 'ఎఫ్-2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). సంక్రాంతి అల్లుళ్ళుగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాగా, విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించగా, సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించారు. ఈ చిత్రం గత 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 71.56 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ కలెక్షన్లను ఏరియాపరంగా పరిశీలిస్తే... 
 
నైజాంలో రూ.20.44 కోట్లు, సీడెడ్‌లో రూ.7.58 కోట్లు, యూఏలో రూ.8.94 కోట్లు, గుంటూరులో రూ.5.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.6.25 కోట్లు, వెస్ట్‌లో రూ.3.66 కోట్లు, కృష్ణాలో రూ.4.48 కోట్లు, నెల్లూరులో రూ.1.71 కోట్లు కలుపుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.58.16 కోట్లను రాబట్టింది. విదేశాల్లో రూ.4.60 కోట్లు, ఓవర్సీస్‌లోరూ.8.80 కోట్లు కలుపుకుని మొత్తం 71.56 కోట్ల రూపాయలను రాబట్టింది. కాగా, ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు క్యూకడుతుండటంతో అదనంగా మరో ఐదు సీన్లను జతచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments