Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

దేవీ
బుధవారం, 14 మే 2025 (18:04 IST)
Naveen Chandra
తెలుగు తమిళ్ బైలింగ్వల్ చేయడం ఇప్పుడు అడ్వాంటేజ్ గానే భావిస్తున్నాను. లెవెన్ సినిమాకి తమిళ్ డబ్బింగ్ నేనే చెప్పాను. నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా అన్ని సినిమాలకి ప్రతి భాషలో నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తుంటాను అని నవీన్ చంద్ర తెలిపారు.
 
నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,  రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర  సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
- నా ప్రతి సినిమాకి పది మంది ఆడియన్స్ అయినా పెరగాలనే ఉద్దేశంతో అన్ని రకాల పాత్రలు చేస్తున్నాను. నాకు సూర్య సినిమాలో నటించాను కోరిక వుండేది. గేమ్ ఛేంజర్ టైమ్ లో రెట్రో సినిమాకు ఆఫర్ వచ్చింది. కానీ అది చేయలేకపోయా.
 
- ఒకరోజు అనుకోకుండా రవితేజ గారికి విలన్ గా చేయాలని సితార నుంచి కాల్ వచ్చింది. రిఫర్ చేసింది కూడా రవితేజ గారే. అరవింద్ సమేతలో నా క్యారెక్టర్ ని ఎలా యూనిక్ గా ఫీల్ అయ్యారో.. అంతే యూనిక్ గా ఈ సినిమాలో వుంటుంది. నా లుక్ కూడా చాలా వెరైటీగా వుంటుంది.

 నేను ఈమధ్య కాప్ కారెక్టర్లు చేస్తున్నానని కామెంట్లు వున్నాయి. ఇప్పుడు వాటికి దూరంగా సరికొత్త పాత్రలు చేస్తున్నా. కామెడీ పాత్ర కూడా చేయబోతున్నా.
 
- ఇటీవలే కరుణ్ కుమార్ తో చేస్తున్న సినిమా హానీ. మూడు రోజులు షూటింగ్ చేశా. చాలా డార్క్ సినిమా అది. చాలా కొత్తగా వుంటుంది.
 
- అలాగే కాళీ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ లో ఓ సినిమా జరుగుతోంది. అలాగే హరి అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అది కామెడీ ఫిలిం. ఫస్ట్ టైం కామెడీ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments