Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

Advertiesment
Ayyana Maane

దేవీ

, బుధవారం, 14 మే 2025 (17:49 IST)
Ayyana Maane
ZEE5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ రికార్డుల్ని క్రియేట్ చేసింది. IMDbలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది. దీంతో దక్షిణ భారతదేశం అంతటా ‘అయ్యనా మానే’ పరిధిని మరింత విస్తృతం కానుంది.
 
చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ  ఈ కథనం తిరుగుతుంది. ప్రతి మరణం కల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని నమ్ముతుంటారు. జాజీ (ఖుషీ రవి) కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రాణాలను బలిగొంటుందని ఇట్టే గ్రహిస్తుంది. నమ్మకమైన పనిమనిషి తాయవ్వ, సిన్సియర్ ఆఫీసర్ మహానేష్ మద్దతుతో ఇంటి రహస్యాలను బయటకు తీసుకు వస్తూ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌,  ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ కథ ఓటీటీలో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
 
ఖుషీ రవి మాట్లాడుతూ, .ఆడియెన్స్ మా వెబ్ సిరీస్ మీద, నా పాత్ర మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఇది నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం. ఇప్పుడు సౌత్ అంతటా కూడా మా సిరీస్ సత్తాను చాటుకుంటుంది’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం