Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

దేవీ
బుధవారం, 25 జూన్ 2025 (15:09 IST)
Muralimohan and dokka seetamma team
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో ఉషారాణి మూవీస్ వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మించారు. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. 
 
ఈ క్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటాను. దివ్యాంగులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీం పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇలా సెలెబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. రేలంగి గారితో నా అనుబంధం మరువలేనిది. రామ సత్యనారాయణ గారు ఎంతో మంది నిర్మాతలకు అండగా నిలుస్తుంటారు. 
 
డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ వెళ్లలేదు. 'నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?' అని డొక్కా సీతమ్మ నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ గారు ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
 
దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ, ఈ కథను చేయాలని మురళీ మోహన్ గారు చెప్పిన క్షణం నుంచీ ఇప్పటి వరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. ఆయన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ .. ‘మురళీ మోహన్ గారి లాంటి గొప్ప వ్యక్తి నటిస్తున్న చిత్రానికి నేను పని చేస్తుండటం ఆనందంగా ఉంది. డొక్కా సీతమ్మ గారు అంటే ధర్మం.. ధర్మం అంటే మురళీ మోహన్ గారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు. 
 
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments