Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎంత వరకు ఈ ప్రేమ' అంటున్న జీవ - కాజల్ అగర్వాల్‌

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ'

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (12:14 IST)
'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'మిరుక్క బ‌య‌మేన్' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ సందర్భంగా ఈ చిత్రానికి మాట‌లు, పాట‌లు అందించిన వెన్నెల‌కంటి మాట్లాడుతూ.. 'సినిమా ఫీల్ గుడ్ మూవీ. జీవా, కాజ‌ల్ జంట న‌టించిన ప్ర‌తి సీన్ పొయెటిక్‌గా ఉంటుంది. సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్‌, అభినంద‌న్ రామానుజ‌మ్ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్ అవుతాయి. తెలుగులో చ‌క్క‌టి మాట‌లు, పాట‌లు కుదిరాయి. ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పే క‌ళాకారులు కూడా చాలా బాగా ఉంద‌ని అప్రిసియేట్ చేశారు. డ‌బ్బింగ్ స‌మ‌యంలో బాగా ఎంజాయ్ చేశాం. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమా మ‌న‌సుకు హ‌త్తుకునేలా సినిమా అహ్లాదంగా ఉంటుంది' అన్నారు. 
 
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. 'సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. వెన్నెల‌కంటిగారు అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. జీవా, కాజ‌ల్ న‌ట‌న‌తో పాటు మిగ‌తా ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్‌, టెక్నిషియ‌న్ స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా వ‌చ్చే నెల మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. 
 
జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments