Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వైశాఖం'లో స్వచ్ఛ భారత్‌ ... దర్శకురాలు జయ బి

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (12:03 IST)
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది. 
 
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రం 'వైశాఖం'. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం రూపొందుతోంది. సాధారణంగా సినీ ప్రముఖులు స్వచ్ఛ భారత్‌ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. 
 
అయితే స్వచ్ఛ భారత్‌ గురించి 'వైశాఖం' చిత్రంలో స్వచ్ఛ భారత్‌కి సంబంధించి ఓ సీన్‌ని చిత్రీకరించడం జరిగింది. చిత్రంలోని ప్రముఖ తారాగణం అంతా పాల్గొన్న ఈ సన్నివేశం కథలో భాగంగానే ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌తోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న 'వైశాఖం' తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కజక్‌స్థాన్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతాయి. 
 
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అక్టోబర్‌ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది'' అన్నారు. హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments