Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ప‌డ‌దే..ప‌డ‌దే` అంటూ ప్రేమ పాట‌ల్లో ఎనిమి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (13:58 IST)
Animi-song
యాక్షన్‌ హీరో విశాల్, ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ అన్ని భాష‌ల‌లో క‌లిపి 20 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంఛ‌నాల‌ను భారీగా పెంచింది. కాగా ఈ రోజు ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన `ప‌డదే..పడదే` ఫ‌స్ట్ సింగిల్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
`అదిడే నిను చూసే క‌నులే నీ స్నేహం కోసం క‌దిలే..అదిగో నిను చూస్తేనే ఏదో కొంచెం సంతోషములే చినగా మాటాడే ప‌ర‌లే ఆ మాట‌లు ఏం స‌రిప‌డ‌వే..స‌రిగా క‌ళ్ల‌ల్లోకి నువ్వే చూస్తే మాటే ప‌గిలే..ప‌డ‌దే.. ప‌డ‌దే.. ప‌డ‌దే.. ఫ్రెండ‌యితే స‌రిప‌డ‌దే.. ప‌డ‌దే.. ప‌డ‌దే.. ప‌డ‌దే.. నా మన‌సుకిదేం ప‌డ‌దే....`అంటూ సాగే ఈ పాట‌కు అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎన‌ర్జీతో ఆల‌పించారు. త‌మ‌న్ క్యాచీ ట్యూన్ మ‌రోసారి సంగీత ప్రియుల్ని ఆక‌ట్టుకుంటోంది. విశాల్, మృణాలిని ర‌వి మ‌ధ్య‌ కెమిస్ట్రీ ఈ పాట‌కి హైలెట్ గా నిలిచింది. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సెప్టెంబ‌రులో తెలుగు, తమిళం, హిందీ స‌హా మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.
తారాగణం: యాక్షన్‌ హీరో విశాల్, ఆర్య, మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్ దాస్, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments