Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం శ్రీదేవి శోభ‌న్‌బాబు

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (13:49 IST)
Sridevi Shobhanbabu
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్నకొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు.`శ్రీదేవి శోభ‌న్‌బాబు` అనే పేరుతో రూపొంద‌నున్న ఈ క్యూట్ ల‌వ్‌స్టోరిలో యువ క‌థానాయ‌కుడు సంతోశ్ శోభ‌న్, `జాను`లో చిన్న‌నాటి స‌మంత పాత్ర‌లో న‌టించిన‌ గౌరి జి.కిష‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్  కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే, సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ ద‌గ్గ‌ర‌గా నిలుచుకుని క‌ళ్లు మూసుకుని ప్రేమ త‌న్మ‌యత్వంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరిగా రూపొందనున్న`శ్రీదేవి శోభ‌న్‌బాబు`తో సుష్మిత కొణిదెల తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments