Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద‌మూరి క‌ళ్యాణ్ డెవిల్ లో రోజీగా ఎల్నాజ్ నోరౌజీ

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (18:06 IST)
Elnaaz Norouji
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. రీసెంట్‌గా రిలీజైన డెవిల్ మూవీ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా బాలీవుడ్ సెన్సేష‌న్ ఎల్నాజ్ నోరౌజీ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఈ మూవీలో ఆమె రోజీ పాత్ర‌లో అల‌రించ‌నుంది.

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ ఎల్నాజ్ నోరౌజీ మా డెవిల్ చిత్రంలో రోజీ పాత్ర‌లో అల‌రించ‌నుంది. ఆమె సిల్వ‌ర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ ప్రేక్ష‌కుల‌ను థియేటర్స్ రప్పిస్తుంది.  ఆమె ఈ చిత్రంలో త‌న‌దైన అద్భుత‌మైన డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకోనుంది. దానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్ పోస్ట‌ర్ సాక్ష్యం అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై డెవిల్ సినిమా రూపొందుతోంది. గాంధీ న‌డికుడిక‌ర్ ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న అందించిన వ‌ర్క్ ఓ విజువ‌ల్ ట్రీట్‌ను అందిస్తుంది. సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను  న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు.  

దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments