Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్,. లో మాయ చేశావే.. పాట కోసం విదేశీ వాయిద్యాలు

British building-instruments
, శనివారం, 23 సెప్టెంబరు 2023 (11:29 IST)
British building-instruments
నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
 
డెవిల్ నుంచి వచ్చిన ‘మాయ చేశావే’ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించింది. డెవిల్ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.
 
నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం కూడా ఎంతో ఉపయోగపడింది. సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు.
 
ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసు.. శనివారం విచారణకు రావాలి.. నవదీప్‌కు నోటీసులు