Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సుల కోసం హీరోయిన్లే నిర్మాతలను అర్థరాత్రి కలుస్తారు : ఏక్తా కపూర్

కాస్టింగ్ కౌచ్.. ఇటీవలి కాలంలో ఈ పదం పదేపదే వార్తల్లో కనిపిస్తోంది... వినిపిస్తోంది కూడా. అంటే.. చిత్రపరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తున్నారు.

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (16:35 IST)
కాస్టింగ్ కౌచ్.. ఇటీవలి కాలంలో ఈ పదం పదేపదే వార్తల్లో కనిపిస్తోంది... వినిపిస్తోంది కూడా. అంటే.. చిత్రపరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. దీంతో కాస్టింగ్ కౌచ్ చర్చ మొదలైంది. తాజాగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి. 
 
తాజాగా ఓ పాపులర్ హిందీ టాక్ షోలో పాల్గొన్న ఏక్తా వద్ద కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నిస్తే, 'దీనికి నిర్మాతలనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం తమంతట తామే నిర్మాతల దగ్గరకు వెళ్తారు. పవర్ పొజిషన్‌లో ఉన్నారు కదా అని నిర్మాతలను నిందించడం సరికాదు' అంటూ సమాధానమిచ్చారు. ఈ ఆన్సర్‌కు బాలీవుడ్ జనాలు అంతా షాక్ అయ్యారట. 
 
'ఓ హీరోయిన్ కావాలనే అర్థరాత్రి నిర్మాతను కలసి, ఆ తర్వాత రోజు సినిమాలో అవకాశం ఇవ్వమంటే ఎవరిది తప్పు..? అతని సినిమాలో ఆమెకు సెట్ అయ్యే పాత్ర లేనప్పుడు ఎవరిని దోషిగా నిలబెట్టాలి' అంటూ నిలదీసింది. దీంతో బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు ఈ లేడీ ప్రొడ్యూసర్‌పై ఫైర్ మండిపడుతున్నారు. 
 
కాగా, గతంలో కాస్టింగ్ కౌచ్‌పై 'మీ టూ' హ్యాష్ ట్యాగ్‌తో హాలీవుడ్ నటీమణులు, బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, రాధికా ఆప్టే, కల్కి కొచ్లిన్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వాళ్లు తమతో అసభ్యంగా ప్రవర్తించిన నిర్మాతలు, ఆ సంఘటనలపై గొంతెత్తిన విషయం తెల్సిందే. ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరో రణ్‌‌వీర్ సింగ్ కూడా ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం