చిక్కుల్లో సుశాంత్ ప్రియురాలు.. ఈడీ పిలుపుతో ఖంగుతిన్న రియా (Video)

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (08:31 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీహార్ సర్కారు కోరగా, దానికి కేంద్రం సమ్మతించింది. అదేసమయంలో కేసును పాట్నా నుంచి ముంబైకు మార్చాలని సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లను రియా బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శుక్రవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 
 
బీహార్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా రియాపై ఈడీ కేసు నమోదు చేసింది. రియాకు సమన్లు జారీ చేసింది. ఇతర అనుమానితులకు వచ్చే వారంలో సమన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. ఎటు చూసినా సుశాంత్ కేసులో రియా చక్రవర్తి చిక్కుల్లో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments