Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ed Sheeran: దేవర పాటను ఇంగ్లీష్ సింగర్ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (video)

సెల్వి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (11:51 IST)
Ed Sheeran
బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో షేప్ ఆఫ్ యూ పాటను పాడారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా లైవ్ ప్రదర్శన చేపట్టారంటూ ఓ పోలీసు ఎంటరై ఎడ్ షీరన్ పాడుతుండగానే మైక్ వైర్ తీసివేశాడు. ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలలో తన ప్రదర్శనలు ఇచ్చాడు. చెన్నైలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్.రెహమాన్‌తో కలిసి ఎడ్ షీరన్ క్లాసిక్ ఊర్వశి సాంగ్‌ను పాడారు. ఇక తాజాగా చర్చ్ స్ట్రీట్‌లో పాడటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
తాము ముందస్తు అనుమతి తీసుకున్నామని దానిని అధికారులు తిరస్కరించారని ఎడ్ షీరన్ టీమ్ తెలిపింది. అయితే వారికి ఇంకా అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా బెంగళూరు పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు 'దేవర' పాటను ఇంగ్లీష్ సింగర్ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ పాడారు. ఒరిజినల్ వెర్షన్ ఆలపించిన గాయని శిల్పారావుతో కలిసి ఓ కన్సర్ట్‌లో 'చుట్టమల్లే' పాటను పాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments