Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదో వివరించిన "ఆర్ఆర్ఆర్" నిర్మాత!!

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (09:26 IST)
తన నిర్మాణ సారథ్యంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్" చిత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఒక తెలుగు చిత్రంలోని ఓ పాటకు ఆస్కార్ రావడం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే, ఈ ఆస్కార్ వేడుకల్లో చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మచ్చుకైనా కనిపించలేదు. దీనిపై అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. దర్శకుడు రాజమౌళికి, నిర్మాత దానయ్యకు ఎక్కడో చెడిందని అందుకే నిర్మాతను దర్శకుడు, చిత్ర బృందం సభ్యులు పట్టించుకోలేదనే ప్రచారం కూడా జరిగింది. 
 
పైగా, "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు రావడం కోసం రాజమౌళి అండ్ కో ఏకంగా రూ.80 కోట్ల మేరకు ఖర్చు చేసి భారీగా లాబీయింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఆస్కార్‌కు వెళ్లకపోవడానికి కారణాలను నిర్మాత దానయ్య తాజాగా వెల్లడించారు. తన గురించి వచ్చిన అన్ని రకాల కథనాలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో రవ్వంత నిజం కూడా లేదని చెప్పారు. 
 
తాను తెరముందు కనిపించకపోయినా, వినిపిస్తే చాలు అని అనుకునే వ్యక్తినని స్పష్టం చేశారు. పబ్లిసిటీ అంటే తనకు నచ్చదని అందుకే ఆస్కార్‌కు వెళ్లలేదని చెప్పారు. ఇకపోతే, "ఆర్ఆర్ఆర్" చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలపై కూడా దానయ్య క్లారిటీ ఇచ్చారు. "ఆర్ఆర్ఆర్" చిత్ర నిర్మాణంలో ఏ ఒక్క హీరో భాగస్వామ్యం లేదని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

కెనడా - మెక్సికో - చైనాలకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్!!

కాలేజీ బాత్రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. యూట్యూబ్‌ వీడియో చూసి బొడ్డు కత్తిరింపు

బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే తొలిసారి... సీఆర్‌పీఎఫ్ ఉద్యోగికి అరుదైన గౌరవం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments