Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీపై డౌట్.. బాత్ టబ్‌లో పడితే.. ఫ్రెండ్‌కి ఎందుకు ఫోన్ చేశారు?

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. శ్రీదేవి గుండెపోటుతో మరణించిందనే వార్త రాగానే యావత్తు సినీ ప్రపంచం శోకంలో మునిగిపోయింది. ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు,

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (20:18 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. శ్రీదేవి గుండెపోటుతో మరణించిందనే వార్త రాగానే యావత్తు సినీ ప్రపంచం శోకంలో మునిగిపోయింది. ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. అయితే యూఏఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంది. దీంతో శ్రీదేవికి గుండెపోటు అని బోనీ కపూర్ ఎందుకు చెప్పారనే దానిపై విచారణ జరుగుతోంది.
 
బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడివుంటే తొలుత స్నేహితుడికి ఫోన్ చేశానని బోనీ కపూర్ పొంతన లేకుండా బదులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీదేవి అచేతనంగా పడివుంటే వైద్యులను ఎందుకు పిలిపించలేదని పోలీసులు బోనీ కపూర్ వద్ద విచారణ జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బోనీ కపూర్‌ను పోలీసులు మూడు గంటల పాటు విచారించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది. బోనీ వాంగ్మూలాన్ని వారు రికార్డు చేసుకున్నారని కూడా సదరు మీడియా తెలిపింది. 
 
శ్రీదేవి స్పృహ కోల్పోయాక సమీపంలో ఉన్న రషీద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్రీదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే  శ్రీదేవి మరణించినట్లు ధ్రువీకరించారు. ఇంకా శ్రీదేవి శవ పరీక్ష అనంతరం, ఇధ్దరు వైద్యులు, ఆసుపత్రిలోని మరో ఐదుగురు అటెండర్ల వద్ద కూడా పోలీసులు విచారణ జరిపినట్లు దుబాయ్ మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments