Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌కు డాక్టర్ రామినేని ప్రత్యేక పురస్కారం..

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (13:19 IST)
కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో పేదలను, ముఖ్యంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ఎంతో సాయం చేసి, తాను రియల్ లైఫ్‌లో హీరోనని అనిపించుకున్న ప్రముఖ ప్రతి నాయకుడు సోనూసూద్ సేవలకు గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ రామినేని ఫౌండేషన్, ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. 
 
డిసెంబర్ లేదా జనవరిలో ఈ పురస్కారాన్ని సోనూసూద్‌కు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ వెల్లడించారు. ఈ సంవత్సరం పురస్కారాలను పొందిన వారి పేర్లను ఆయన ప్రకటించారు. 
 
నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులును విశిష్ట పురస్కారానికి ఎంపిక చేశామని ధర్మ ప్రచారక్ తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ వేమూరి సుధాకర్‌, ద్వారకామయి ట్రస్ట్‌ ద్వారా సేవలందిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్, యాంకర్ కనకాల సుమలను కూడా సత్కరిస్తామని తెలిపారు. 
 
ప్రత్యేక, విశిష్ట పురస్కార విజేతలకు రూ. 2 లక్షల నగదు బహుమతిని, విశేష పురస్కార గ్రహీతలకు రూ.1 లక్షను అందించనున్నామని ఆయన అన్నారు. కాగా, తనకు లభించే నగదు బహుమతిని, హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి అందించాలని సోనూసూద్ ఇప్పటికే రామినేని ఫౌండేషన్‌కు సూచించి, తనలోని పెద్ద మనసును మరోసారి చాటుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments