Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సింహాకొడూరి తో - దొంగలున్నారు జాగ్రత్త

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:18 IST)
Dongalunnaru jagratta opening still
శ్రీ సింహా కొడూరి రెండు చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో న‌టుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం శ్రీ సింహా కొడూరి హీరోగా న‌టిస్తోన్న మూడ‌వ చిత్రం `దొంగలున్నారు జాగ్రత్త`. ఈ సినిమా షూటింగ్  శ‌నివారంనాడుప్రారంభ‌మైందని అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్‌
 
చిత్రయూనిట్ సరైన అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ఒక ప్ర‌త్యేక‌మైన‌ ముద్ర వేశారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన‌ ప్రమోషనల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ మెమోరీ కార్డును దొంగిలించడం గురించి ఉంది. దాన్ని బట్టి సినిమా కథ ఏంటి? హీరో పాత్ర ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇక ఈ వీడియోలోనే సాంకేతిక బృందాన్ని కూడా పరిచయం చేశారు.
 
సముద్రఖని లాంటి అద్భుతమైన నటుడు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సతీష్ త్రిపుర ద‌ర్శ‌కుడు.  రోహిత్ కులకర్ణి సంగీత దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా యశ్వంత్ సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  గ్యారీ బీహెచ్ ఎడిటర్‌.
 
తారాగ‌ణం: శ్రీ సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని
సాంకేతిక వ‌ర్గం:
ప్రొడక్షన్ కంపెనీ: సురేష్ బాబు, గురు ఫిల్మ్స్, నిర్మాత: డి సురేష్ బాబు, సునిత తాటి, డైరెక్టర్: సతీష్ త్రిపుర, కెమెరామెన్: యశ్వంత్ సీ,  సంగీతం: రోహిత్ కులకర్ణి, ఆర్ట్:  గాంధీ నడికుడికర్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, లైన్ ప్రొడ్యూసర్: డి రామ బాలాజీ, మార్కెటింగ్: లిపిక అల్ల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments