Webdunia - Bharat's app for daily news and videos

Install App

`నిన్నిలా నిన్నిలా` చేస్తుంటే `అలా మొద‌లైంది` గుర్తుకు వ‌స్తుందిః నిత్యామీన‌న్

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (12:50 IST)
BVSS Prasad, nithya menon, etc
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `నిన్నిలా నిన్నిలా`. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌. ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో నిత్యామీన‌న్ మాట్లాడుతూ, స్నేహితులంద‌రం క‌లిసి ఓ బ్యూటీఫుల్ సినిమా చేశాం. మా అంద‌రికీ ఎంతో న‌చ్చిన సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు అలా మొద‌లైంది గుర్తుకు వ‌స్తుంది. నందినీ, నేను, నాని క్లోజ్‌ఫ్రెండ్స్‌గా చేసిన సినిమా అది. ఆ సినిమా ఎంత బాగా హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాలాగానే `నిన్నిలా నిన్నిలా` సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు అని.ఐ.వి.శ‌శి మాట్లాడుతూ - ``సినిమాటోగ్రాప‌ర్ దివాక‌ర్ మ‌ణి చెప్పిన‌ట్లు స్నేహితులం అంద‌రూ క‌లిసి చేసిన సినిమా ఇదిఅంద‌రూ నిజాయ‌తీతో సినిమా చేశాం. . అంద‌రం లండ‌న్ వెళ్లి ఫ‌న్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాను పూర్తి చేశాం. సినిమా బాగా వ‌చ్చింది. సినిమా చూస్తున్నంత సేపు చిరున‌వ్వుతో ఉంటారు`` అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజేశ్ మురుగేశ‌న్‌ మాట్లాడుతూ - ```నిన్నిలా నిన్నిలా నైస్ మూవీ. నాకు మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌. సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రేజ్ చేయండి`` అన్నారు. 
 
హీరోయిన్ రీతూవ‌ర్మ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు అనిగారికి, నిర్మాత‌లు ప్ర‌సాద్‌గారికి, బాపినీడు గారికి థాంక్స్‌. నాజర్‌గారు, నిత్యామీన‌న్‌, అశోక్ సెల్వ‌న్‌తో క‌లిసి యాక్ట్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది`` అన్నారు. 
చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌మాట్లాడుతూ - ``ల‌వ్ అండ్ ఎమోష‌న్ మూవీ `నిన్నిలా నిన్నిలా`. అశోక్ సెల్వ‌న్‌, రీతూవ‌ర్మ‌, నిత్యామీన‌న్ స‌హా అని ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు. 
 
హీరో అశోక్ సెల్వ‌న్ మాట్లాడుతూ - ``ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌కు భిన్న‌మైన చిత్రం. ఫీల్ ఉండే ల‌వ్ స్టోరితో తెర‌కెక్కింది. ఫ్రెండ్స్‌లా అంద‌రం కలిసి ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా కూల్‌గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపే ఓ స్మైల్ మీ మొహంలో ఉంటుంది. జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ చూసి మా ప్ర‌య‌త్నాని ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నాను`` అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments