పెండ్లికాని ప్రసాద్‌లా బాలీవుడ్‌లో నిర్మాత, దర్శకుడు, యాంకర్, నటుడు అయిన కరణ్ జోహార్ పురుషులతో సంబంధాలు పెట్టుకుంటాడనే టాక్ విస్తరించింది. అందులో భాగంగా బాలీవుడ్ బాద్‌షాతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడనేది చాలాకాలంగా హల్‌చల్ చేస్తోంది. కరన్ గే గా బాలీవుడ్ చెబుతోంది. అయితే వీరిద్దరి స్టేజీపై పలు ఫంక్షన్లలో కలిసినప్పుడు ముద్దు పెట్టుకోవడాలు జరిగాయి. వాటి ఆధారంగా చాలా కథనాలు విస్తరించాయి కూడా.
ఈ విషయమై చాలాకాలంగా వస్తున్న వార్తలను ఫుల్‌స్టాప్ పెడుతూ కరణ్ జోహార్ `యాన్ అన్ సూటబుల్ బాయ్` అనే పుస్తకాన్ని రాశాడు. ఇందులో ఆయన చెప్పాలనుకున్నవి చెప్పేశాడు. అందులో షారూఖ్ గురించి రాశాడు. ఆమధ్య ఓ యాంకర్‌కూడా నన్ను అడిగింది. షారూఖ్‌తో పడకసుఖం పొందారా! అని దానికి నేను ఆశ్చర్యపోయాను. షాక్ అయ్యాను. గుండె పిండేసినంతయింది. షారూఖ్ నాకు తండ్రిలాంటివాడు. అన్నలా ఓదార్చేవాడు. ఇదే మీ అన్నతో నువ్వు సెక్స్ చేస్తావా! అని వెంటనే ఆ యాంకర్‌ను అడిగేశాను అంటూ బుక్‌లో రాశాడు. మగవాడు పెండ్లి చేసుకోకపోతే గే కింద లెక్కేనా. శృంగారం అనేది ఇద్దరు మనసులతో చేసేది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలా బాధించాయి.. అంటూ వివరించారు. ఇది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.