నయనతార సీతనా? ఆమెను చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయ్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (15:33 IST)
హీరోయిన్ నయనతారపై తమిళ సీనియర్ నటుడు, డీఎంకే నేత రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నయనతార సీతగానూ, దెయ్యంగా నటిస్తూ మెప్పిస్తోందన్నారు. పైగా ఆమెను చూస్తే దెయ్యాలు సైతం పారిపోతాయని చెప్పారు. 
 
నయనతార అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో రాణిస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె తాజాగా "కొలైముదిర్" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాధారవి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నయనతార గొప్పనటే కానీ ఆమెను ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లతో పోల్చడం సరికాదని చెప్పారు. నయనతార సీతగా చేసి మెప్పించింది. అటు దెయ్యంగా చేస్తూ మెప్పిస్తోంది. నయనతారను చూస్తే దెయ్యాలు కూడా పారిపోయని అన్నాడు.
 
ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. మహిళపై రాధారవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తమిళ సినీ నటులు మండిపడుతున్నారు. వెంటనే ఆయనను విధుల నుంచి తొలగించాలని, నయనతారకు క్షమాపణలు చెప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాధారవి వ్యాఖ్యలపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఆయన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments