Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ నాగార్జున- రకుల్ ప్రీత్ సింగ్ 'మన్మథుడు 2' స్టార్ట్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:35 IST)
కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో `మ‌న్మ‌థుడు 2` ప్రారంభమైంది. `మ‌న్మ‌థుడు` సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మ‌రో ఎంట‌ర్‌టైన‌ర్ `మ‌న్మ‌థుడు 2`.
 
మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న `మ‌న్మ‌థుడు 2` నేడు లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. 
చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమ‌ల‌, నాగ‌చైత‌న్య ముఖ్య అతిథులుగా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు. 

అమ‌ల అక్కినేని ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా.. అక్కినేని నాగ‌చైత‌న్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నారు. `RX 100` ఫేమ్  చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
న‌టీన‌టులు: కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌ కిషోర్‌, రావు ర‌మేష్‌, నాజ‌ర్‌,  
ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు. సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌, నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌, నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌, స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌, ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి, 
డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments