Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్‌కు సర్జరీ.. కుడికాలి వేలు తొలగింపు

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (09:09 IST)
కోలీవుడ్ సీనియర్ హీరో, రాజకీయ నేత, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్‌కి చెన్నైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని పూర్వంలా ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుతూ విజ‌య్ కాంత్ మిత్రుడు.. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ట్వీట్ చేశారు.

అలాగే క‌మ‌ల్ హాస‌న్ సైతం విజ‌యకాంత్ పూర్తి ఆరోగ్యంతో వ‌స్తార‌ని కోరుకుంటూ ట్వీట్ చేశారు. దీంతో కెప్టెన్ ఫ్యాన్స్ అస‌లేం జ‌రిగిందో తెలియ‌క చాలా టెన్ష‌న్ ప‌డుతున్నారు.
 
ఇంతకీ విజయ్‌కాంత్ ఆరోగ్యానికి ఏమైందంటే..? గ‌త కొన్నాళ్లుగా హై షుగ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు విజయ్ కాంత్. తాజాగా మ‌రోసారి ఆయ‌న‌కు ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌టంతో ఆయ‌న్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. 
 
చెక్ చేసిన డాక్ట‌ర్స్ కుడికాలులోని ఓ వేలుకి ర‌క్త ప్ర‌స‌ర‌ణ కావ‌టం లేద‌ని గుర్తించారు. దాంతో ఆ కాలి వేలుని తొల‌గించారు. ఇంకా విజయకాంత్‌ హాస్పిట‌ల్‌లోనే ఉన్నారు.

రెండు, మూడు రోజుల్లోనే ఆయ‌న కోలుకుంటార‌ని స‌మాచారం. అభిమానులు టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments