Webdunia - Bharat's app for daily news and videos

Install App

టక్కర్ లో ప్రకృతి అందాల నడుమ దివ్యాంశ కౌశిక్ స్టెప్పులు

Webdunia
గురువారం, 4 మే 2023 (19:11 IST)
Divyansha Kaushik
హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన 'టక్కర్' మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'కయ్యాలే' అనే సాంగ్ ఫుల్ వీడియోని విడుదల చేసి మేకర్స్ సర్ ప్రైజ్ చేశారు.
 
'కయ్యాలే' వీడియో సాంగ్ ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. సిక్కిం లోని బుద్ధ పార్క్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. వాంచినాథన్ మురుగేశన్ తన కెమెరాతో బంధించిన ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. నివాస్ కె ప్రసన్న అందించిన మ్యూజిక్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. ఇక దివ్యాంశ కౌశిక్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. కథానాయిక స్వభావాన్ని, సమాజం పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలిపేలా ఈ పాట సాగింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ క్యాచీ గానూ, అర్థవంతంగానూ ఉన్నాయి. నిరంజనా రామన్ ఎంతో జోష్ తో పాటను ఆలపించారు. ఆమె గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి ఈ 'కయ్యాలే' సాంగ్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
 
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments