Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజన గల్రాని సినీ కార్మికులకు వస్తువుల పంపిణి

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (16:01 IST)
`బుజ్జిగాడు` హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్న‌దానం చేశారు.అలాగే శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా పంపిణీ  చేశారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘కోవిడ్‌ భాదితులు మెరైగన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి భయటపడుతుంది. 
 
Sanjana Galrani
నేను స్థాపించిన  సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మే 10 నుండి మీఇంటి సెల్లార్ లోనే వంట వండించి రోజు 500 మంది రెండు పూటలా వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, పులిహోర, పెరుగన్నం, బిష్బిళ్ళ బాత్ పెరుగన్నం ఇలా  రోజు మెనూ మారుస్తూ పేదవారికి ఆహరం అందిస్తున్నాను. అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలికి పనిచేసే సినీ పరిశ్రమకు చెందిన లైట్ బాయ్స్ , ప్రొడక్షన్ ఫోర్త్ క్లాస్ కార్మికులకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జూన్ 2న అందించాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాను" అంటూ దయచేసి అందరు ఇంట్లోనే ఉడండి. కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండండి కానీ కోవిడ్‌ పాజిటివ్‌ తెచ్చుకోకండి అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments