Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

దేవీ
శుక్రవారం, 27 జూన్ 2025 (17:06 IST)
Karthik Raju, Misti Chakravarthy
ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా  సోషియో ఫాంటసీ ప్రేమకథతో  సినిమాగా  "దీర్ఘాయుష్మాన్ భవ" చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లు. ఎం.పూర్ణానంద్  దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై  వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు.   
 
సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ కథాశంతో  రెండున్నర గంటలపాటు  ప్రీక్షకులను అలరింపజేసే  వినోదంతో  ఈ చిత్రాన్ని మలచడం జరిగిందని ఆయన చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చాం. ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుందని అన్నారు. యూత్ తో  పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు. . 
 
దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ,  "ఈ చిత్రంలోని పాత్రలలో ఎవరికి వారు పోటీపడి నటించారు. జబర్దస్త్  ఆర్టిస్టుల కామెడీ ఆద్యంతం నవ్వుల పూలు పూయిస్తుంది. హీరో, హీరోయిన్లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. సీనియర్ నటి ఆమని నటన ఓ హైలైట్. మొత్తం మీద ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది.  ఆ విషయంలో మా టీమ్ సక్సెస్ అయినట్లు నమ్మకంగా చెప్పగలం"  అని అన్నారు. 
 
 ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో ఆమని, నాగినీడు ,కాశీ విశ్వనాధ్,  పృథ్వీరాజ్‌, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్. జె మిని సురేష్‌, నోయల్, గుండు సుదర్శన్ తదితరులు నటించారు. 
 
ఈ సినిమాకు మల్హర్ భట్ జోష్ ఛాయాగ్రహణం  సమకూర్చగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని, కిషోర్ మద్దాలి ఎడిటింగ్  అందించారు. నిర్మాత: వంకాయలపాటి మురళీకృష్ణ, దర్శకత్వం:: ఎం.పూర్ణానంద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

తాలిబన్ పాలిత దేశంలో ప్రకృతి ప్రళయం... వందల్లో మృతులు

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments