Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడో దొంగ ఉన్నాడు... అతన్నే అడగండి : వి.వి. వినాయక్

జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అదుర్స్. ఈచిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, జూనియర్ ఎన్టీఆర్‌కు నటనా పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అదుర్స్ సీక్వెల్ రావాలని ఎన్ట

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (14:12 IST)
జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అదుర్స్. ఈచిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, జూనియర్ ఎన్టీఆర్‌కు నటనా పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అదుర్స్ సీక్వెల్ రావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ విషయం జై లవ కుశ ఆడియో వేడుకలో ప్రస్తావనకు వచ్చింది. 
 
ఇటీవల జరిగిన 'జై లవ కుశ' మూవీ ట్రైలర్ లాంచ్‌కు వినాయక్ ముఖ్య అథితిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా, అభిమానులు అదుర్స్-2... అదుర్స్-2 అంటూ గోలగోల చేశారు. దీనిపై స్పందించిన వినాయక్ 'కచ్చితంగా చేద్దాం' అన్నాడు. తన పక్కనే ఒక దొంగ ఉన్నాడని, అతనే కోన వెంకట్ అని చెప్పాడు. 'కోనా.. వింటున్నావా? ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఓ మంచి కథ రాయవయ్యా. కొద్ది రోజుల్లో అదుర్స్-2 చేద్దాం' అంటూ నవ్వులు పూయించాడు. 
 
కాగా, 2010లో జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'అదుర్స్' సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. ఓ పాత్రలో యాక్షన్, మరో పాత్రలో కామెడీ చేస్తూ అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా 'అదుర్స్-2' చేయాలనే కోరిక ఇటు తారక్‌కు, అటు వినాయక్‌కు ఉంది. అయితే, ఇద్దరూ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లని విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments