Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచ‌భూతాలే ఆ పని చేయించాయంటోన్న డైరెక్ట‌ర్..!

పంచ‌భూతాలే ఆ ప‌ని చేయించాయంటోన్న డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు సాక్ష్యం డైరెక్ట‌ర్ శ్రీవాస్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ సాక్ష్యం అనే సినిమాని తెర‌కెక్కించాడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా ఆడియో వేడు

Webdunia
సోమవారం, 9 జులై 2018 (18:20 IST)
పంచ‌భూతాలే ఆ ప‌ని చేయించాయంటోన్న డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు సాక్ష్యం డైరెక్ట‌ర్ శ్రీవాస్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ సాక్ష్యం అనే సినిమాని తెర‌కెక్కించాడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుక సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. సాయిశ్రీనివాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ఈ నెల 27న సాక్ష్యం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, నా పంచ‌భూతాల పాట మాట్లాడేసింది. నేను ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు చేసాను. ఆ ఎక్స్‌పీరియ‌న్స్‌తో ఆరో సినిమాగా ఈ సినిమా చేశాను. ర‌క‌ర‌కాల క‌థ‌లు అనుకుని, కొత్త క‌థ‌ చెప్పినా ఆడియ‌న్స్ అర్థం చేసుకునే స్థాయికి వ‌చ్చేశార‌ని గ్రహించి ఫైన‌ల్‌గా ఈ క‌థ‌ను చెప్పాను. 
 
పంచ‌భూతాల ఐడియా రాగానే, పంచ‌భూతాల స‌పోర్ట్‌తోనే ఈ సినిమా ఎలాంటి ఆటంకం లేకుండా జ‌రిగింది. కొన్ని ఐడియాలు ఎలా వ‌చ్చాయో నాకే ఆశ్చర్యం వేస్తుంది. అవి ఎప్పుడూ నేను చూసిన‌వి కావు, ఎక్కడా విన్నవి కావు. మంచి క‌థ‌ను, మంచి విష‌యాన్ని జ‌నాలకి చెప్పాల‌నే ఆలోచ‌న నాకు ఎప్పుడైతే వ‌చ్చిందో.. అప్పుడే పంచ‌భూతాలు కూడా నాతో ఈ ప‌నులు చేయించాయి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments