Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా రాఘ‌వేంద్ర‌రావు, ఆయనతో నలుగురు హీరోయిన్లు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (13:33 IST)
ఆశ్చ‌ర్యంగా వుందా?! ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు హీరోగా న‌టించ‌డం ఏమిట‌ని.. ఇది ఆశ్చ‌ర్యంగా వుంటుంది. కానీ నిజం. త్వ‌ర‌లో ఆయ‌న న‌టించ‌నున్న సినిమాను ఈ ఏడాదిలో ప్రారంభించ‌నున్నారు. మామూలుగా ఆయ‌న ఎక్కువ‌గా మాట్లాడ‌డు.మౌన‌మునిలా వుంటాడ‌నేది అంద‌రికీ తెలిసిందే. ఎన్నాళ్ళ‌కోకానీ.. టీవీ షోలో ఆయ‌న మాట‌లు విన్నాం. అలాంటి వ్య‌క్తిని మార్చిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా! త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు.
 
భ‌ర‌ణిగారి ద‌గ్గ‌ర‌కి రచ‌యిత‌, న‌టుడు రాఘ‌వ ఓ క‌థ‌ను తీసుకువ‌చ్చి వినిపించారు. అది విన్న వెంట‌నే అద్భుతంగా వుంద‌ని చెప్పారు. మ‌రి హీరో ఎవ‌రంటే.. ఇది రాఘ‌వేంద్రరావుగారికి స‌రిపోతుంద‌ని చెప్పాడు రాఘ‌వ‌. అందుకు ఆయ‌న ప‌ర్మిష‌న్ తీసుకోవడానికి ప్ర‌య‌త్నిస్తే.. నేను విన‌ను.. కుద‌ర‌దు.. అని తేల్చిచెప్పాడ‌ట‌. మ‌ర‌లా తిరిగి భ‌ర‌ణిగారిని క‌లిసిన రాఘ‌వ‌.. ఎలాగైనా ఒక‌సారి వినేటట్లు చేయ‌మ‌ని అడ‌గడంతో.. భ‌ర‌ణిగారే స్వ‌యంగా ఫోన్ చేసి.. మీరు న‌టించ‌వ‌ద్దు.. వినండి చాలు.. న‌చ్చ‌క‌పోతే తిర‌స్క‌రించ‌డని చెప్పార‌ట‌.
 
దాంతో.. రాఘ‌వేంద్రరావుగారు క‌థ‌ను విన‌డం.. వెంట‌నే తాను ఈ సినిమా త‌ప్ప‌కుండా చేస్తాన‌న‌డం జ‌రిగిపోయాయి.  ఇదంతా కార్య‌రూపం దాలిస్తే.. ఈ ఏడాదికి సెట్‌పైకి వెళ్ళ‌నుంది. ఇంత‌కీ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నుకుంటున్నారు.. మిథునం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌ర‌ణిగారే.. మ‌రి ఆ సినిమా ప‌ట్టాలెక్కితే కొత్త కోణంలో రాఘ‌వేంద్రరావును చూడ‌వ‌చ్చు. ఎందుకంటే హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు, హీరోయిన్లుగా న‌లుగురు న‌టించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments