Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమా మిస్స‌యిందంటున్న 'గబ్బర్ సింగ్' డైరెక్టర్

టాలీవుడ్‌లో ఉన్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత 'దువ్వాడ జగన్నాథం' (డీజే)తో ఫర్వాలేదనిపించాడు. ఇపుడు దాగుడు

Webdunia
గురువారం, 19 జులై 2018 (11:08 IST)
టాలీవుడ్‌లో ఉన్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత 'దువ్వాడ జగన్నాథం' (డీజే)తో ఫర్వాలేదనిపించాడు. ఇపుడు దాగుడు మూతలు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, హరీష్ శంకర్ చాలా నిర్వేదాన్ని ప్రదర్శించాడు.
 
బుధవారం 'ల‌వ‌ర్' రిలీజ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దిల్‌రాజు త‌న సినిమాల రిలీజ్ తేదీల్ని ప్ర‌క‌టించారు. రాజ్‌త‌రుణ్‌ 'ల‌వ‌ర్' చిత్రం ఈనెల 12న రిలీజ‌వుతోంది. నితిన్ 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నాం. రామ్ సినిమా 'హలో గురు ప్రేమ కోసమే' దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వెంకీ-వ‌రుణ్‌తేజ్ మ‌ల్టీస్టార‌ర్ "ఎఫ్ 2" జ‌న‌వ‌రి 12న రిలీజ‌వుతుంది. అటుపై  2019 ఏప్రిల్ 25న మ‌హేష్ 5వ సినిమా రిలీజ్ చేస్తాం అంటూ వివ‌రాలందించారు. 
 
అదేసమయంలో 'దాగుడు మూత‌లు' చిత్రం ప్ర‌స్తుతానికి వాయిదా ప‌డింద‌నే సంకేతాలను దిల్ రాజు వెల్లడించారు. దీనిపై కాస్తంత నిర్వేదం ఫీలైన హ‌రీష్ శంకర్.. తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఈ జాబితా నుంచి నా సినిమా మిస్స‌యింది. కాస్త ఇబ్బందిక‌రంగానే ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని త‌ప్ప‌వు.. అయితే ఆ ఐదు సినిమాల రిలీజ్‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు చెబుతున్నా" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments