కార్తికేయ 2 సినిమాకు జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి

డీవీ
బుధవారం, 9 అక్టోబరు 2024 (13:08 IST)
Director Chandoo Mondeti receiving awrad from president murmu
తెలుగు సినిమా గర్వంచే క్షణాలను చిత్ర పరిశ్రమకు అందించారు టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి. ఆయన రూపొందించిన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా కార్తికేయ 2 చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డ్ స్వీకరించారు దర్శకుడు చందూ మొండేటి మరియూ నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ సందర్భంగా టీమ్ కు సినీ పరిశ్రమలోని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
నిఖిల్ హీరోగా కృష్ణతత్వాన్ని, శ్రీకృష్ణుడి గొప్పదనం తెలియజేస్తూ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ 2 చిత్రాన్ని రూపొందించారు చందూ మొండేటి. త్వరలో ఈ సినిమాకు మరో సీక్వెల్ కార్తికేయ 3 కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా పాన్ ఇండియా మూవీ "తండేల్" రూపొందిస్తున్నారు చందూ మొండేటి. మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సన్నాహాలు చేస్తున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ చిత్రాలతో చందూ మొండేటి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments