Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ ద‌ర్శ‌క‌త్వంలొ అభిరామ్ హీరోగా అహింస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:49 IST)
Abhiram, Geetika Tiwari, teja and others
డి. సురేష్‌బాబు ద్వితీయ కుమారుడు అభిరామ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం అహింస. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతిక తివారీ కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  అన్ని కమర్షియల్ హంగులతో కూడిన కథతో తేజ మార్క్ సినిమా ఇది.
 
సినిమా ప్రీ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. 'అహింస`లో హై యాక్షన్‌ ఉంటుందనే అభిప్రాయాన్ని ఇచ్చింది. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనుంది.
 
అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన ఆర్‌పి పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నువ్వు నేను తర్వాత తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్,  ఆర్‌పి పట్నాయక్ మరో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అందించడానికి మరోసారి  చేతులు కలిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు నిర్మాతలు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సమీర్ రెడ్డి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
 
సాంకేతిక విభాగం-కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ,  నిర్మాత: పి కిరణ్, సంగీతం: ఆర్పీ పట్నాయక్, డీవోపీ : సమీర్ రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల, సాహిత్యం: చంద్రబోస్, ఆర్ట్: సుప్రియ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments