బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరిక

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (21:19 IST)
Dileep Kumar
బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. దిలీప్ కుమార్ ఇద్దరు త‌మ్ముళ్లు అస్లాం ఖాన్‌, ఎహ్సాన్ ఖాన్ క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గ‌త కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతోన్న దిలీప్ కుమార్‌ను ఆదివారం ఉద‌యం కుటుంబ‌స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్పించారు. ముంబ‌ైలోని హిందూజా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దిలీప్ కుమార్ ప్ర‌స్తుతం సీనియ‌ర్ డాక్ట‌ర్లు.. కార్డియాల‌జిస్ట్ నితిన్ గొఖ‌లే, పుల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్ జ‌లిల్ పార్‌క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు.  
 
గత నెలలోనూ ఆయన సాధారణ పరీక్షల కోసం దవాఖానలో చేరారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. కాగా 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వైవిధ్య చిత్రాల్లో న‌టించిన దిలీప్ కుమార్ దేశ వ్యాప్తంగా న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments