టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హిందీ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలికాలంలో వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత ఓ భారీ ప్రాజెక్టు ద్వారా తిరిగి పుంజుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ వివరాలను పరిశీలిస్తే, వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కథకు సల్మాన్ ఖాన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారని, ప్రస్తుతం ఇతర ఒప్పందాలు, మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ చర్చలు విఫలమైతే త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమిళ అగ్ర హీరో విజయ్‌తో "వారిసు" అనే చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇపుడు సల్మాన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఫిల్మ్ వర్గాలో ఆసక్తిగా మారింది.