Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

Advertiesment
Balagam team and Nitin

చిత్రాసేన్

, శనివారం, 11 అక్టోబరు 2025 (17:20 IST)
Balagam team and Nitin
బలగం సినిమాతో పెద్ద హిట్ సాధించిన నటుడు, దర్శకుడు వేణు యెల్దండి తో దిల్ రాజు సినిమా తదుపరి సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతుండడతో ఆమధ్య జబర్ దస్త్ లో రీ ఎంట్రీ గా ఎపిసోడ్స్ చేశారు. ఆమధ్య కూడా దిల్ రాజు యెల్లమ్మ సినిమా నితిన్ తో వుంటుందనీ వెల్లడించారు. అయితే ఈ సినిమాలో హీరోల పేర్లపై ఇంకా సందిగ్థత నెలకొందని తెలుస్తోంది.
 
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ గా మారింది. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ గ్రామీణ వినోదాత్మక చిత్రాన్ని మొదట నానికి ఆఫర్ చేశారు, కానీ అప్పటికే దసరా అనే సినిమా చేయడంతోపాటు కొన్ని కారణాల వల్ల ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత నిర్మాతలు నితిన్‌ను అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాలో నటించడం మానేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శర్వానంద్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నట్లు తాజా వార్తలు రావడంతో యెల్లమ్మ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
 
ఇటీవలి కాలంలో చాలాసార్లు చేతులు మారిన అరుదైన ప్రాజెక్టులలో యెల్లమ్మ ఒకటిగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు  నిర్మిస్తారు, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్