Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Advertiesment
Raghav Juyal, Srikanth Odela

చిత్రాసేన్

, సోమవారం, 6 అక్టోబరు 2025 (16:02 IST)
Raghav Juyal, Srikanth Odela
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా తర్వాత చేస్తున్న చిత్రం ప్యారడైజ్. షూటింగ్ చిత్రీకరణ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబు ప్రవేశించారు. షూటింగ్ కూడా ఆయనపై చిత్రీకరించారు. తాజాగా ఇందులో మరో కీలక పాత్రను డెహ్రాడూన్ కు చెందిన నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ద్రీవీకరిస్తూ దర్శకుడు ప్యారడైజ్ కార్యాలయంలో జుయల్ కు సీన్ వివరిస్తున్న ఫొటోను షేర్ చేశారు. మోహన్ బాబు కొడుకుగా నటిస్లున్నాడా అనేది తెలియాల్సి వుంది.
 
 బాలీవుడ్  కిల్ వంటి పలు చిత్రాల్లో నటించిన రాఘవ్ జుయల్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. సెషన్‌లో దర్శకుడు వివరించిన ముడి దృశ్యాలను చూసి రాఘవ్ ఉత్సాహంగా ఉన్నాడు. అతను త్వరలో సెట్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్చి 26, 2026లో థియేటర్లలో విడుదలకాబోతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో విడుదలవుతోంది.
 
SLV సినిమాస్ బ్యానర్ పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ నుండి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ విడుదలై అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. నాని నెవర్ బిఫోర్ లుక్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ