దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రానికి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా విజయశాంతి తన చిత్రం గురించి ట్విట్టర్లో ఇలా రాసుకున్నారు.
1985 అక్టోబర్ 11.....
2025 అక్టోబర్ 11....
నేటికీ
40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం. నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ ప్రతిఘటన.
దర్శకులు శ్రీ టీ కృష్ణ గారికి, నిర్మాత శ్రీ రామోజీరావు గారికి, అద్భుతమైన ఈ దుర్యోధన దుశ్శాసన పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావు గారికి, సహ నటి నటులకు, సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదములతో... హర హర మహాదేవ్, మీ విజయశాంతి అంటూ పేర్కొన్నారు.