Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

Advertiesment
son in law murder

ఠాగూర్

, బుధవారం, 6 ఆగస్టు 2025 (14:07 IST)
హైటెక్ యుగంలో మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వరుసవావిళ్లు మరిచిపోతున్నారు. పలువురు పురుషులు కామంతో పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు మహిళలు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏకంగా అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తలనే కాటికి పంపుతున్నారు. తాజాగా ఓ ఇంటి అల్లుడు పీకల వరకు మద్యం సేవించి, వృద్ధురాలైన 68 యేళ్ల అత్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడ గ్రామంలో సోమవారం అర్థరాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని హిమాయత్ నగర్‌కు చెందిన షేక్ నజీం(45) అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో పాటు అత్తతో తరోడ గ్రామానికి వలస వచ్చి జీవిస్తున్నారు. కూలి పనులు చేసే నజీం కొన్నేళ్లుగా మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో పది రోజుల క్రితం అతడి భార్య మేస్త్రీ పని నిమిత్తం కుమారుడితో కలిసి మహారాష్ట్రలోని శివుని గ్రామానికి వెళ్లింది. దీంతో అత్త ఒక్కరే ఇంట్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం పీకల వరకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన నజీం... ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి నుంచి ఆమె తీవ్రంగా ప్రతిఘటించి తప్పించుకుంది. ఈ క్రమంలో ఆమె గాయపడగా, ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చింది. సోమవారం అర్థరాత్రి నజీం మరోమారు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ క్రమంలో ఆమె పక్కనే ఉన్న కర్రతో అతన్ని కొట్టి, గొంతు నులిమి హత్య చేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్