Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

Advertiesment
Satya Dev unveils Vasudevasutham teaser

చిత్రాసేన్

, శనివారం, 11 అక్టోబరు 2025 (16:59 IST)
Satya Dev unveils Vasudevasutham teaser
ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడి కథతో వసుదేవసుతం చిత్రం రూపొందుతోందిన టీజర్ లో వెల్లడిస్తోంది. మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన వసుదేవసుతం మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను తాజాగా ప్రముఖ హీరో సత్య దేవ్ రిలీజ్ చేశారు.
 
ఈ ట్రైలర్‌.. ‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అంటూ ఎంతో పవర్ ఫుల్‌గా సాగిన డైలాగ్‌తో టీజర్‌ను అద్భుతంగా ప్రారంభించారు. హీరో ఎంట్రీ.. గుడి, గుప్త నిధిని చూపించినట్టుగా వేసిన షాట్స్, హీరో హీరోయిన్ల ట్రాక్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్‌ను గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేశారు.
 
మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో కత్తితో నరికే సీన్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఇక పార్కింగ్ మూవీ ఫేమస్ జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ టీజర్‌లోనే ఇంత గ్రాండ్‌నెస్ కనిపిస్తుందంటే.. సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అర్థం అవుతోంది.
రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.
 
తారాగణం: మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chandni : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సిద్ధం