Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ వెడ్డింగ్ ... సెల్ఫీతో అదరగొట్టిన దిల్ రాజు భార్య

Webdunia
బుధవారం, 13 మే 2020 (08:35 IST)
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు. ఈయన ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ వేళ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిజామాబాద్‌లోని నార్సింగపల్లిలో ఉన్న శ్రీవేంకటేశ్వర ఆలయంలో వీరి వివాహం ఆదివారం రాత్రి జరిగింది. 
 
అయితే, వధువు వివరాలను దిల్ రాజు అత్యంత గోప్యంగా ఉంచారు. చివరకు వధువు ఫోటోను కూడా ఆయన బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు పెళ్లి అయిన తర్వాత దిల్ రాజు దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
అయితే, వివాహం తర్వాత తన భర్తతో కలిసి భార్య తేజస్విని సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని కూడా ఆమె స్వయంగా తీసింది. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో కూడా వైరల్ అయింది. కాగా, తన తండ్రికి రెండో భార్యను దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి స్వయంగా ఎంపిక చేసి, ఈ పెళ్లి చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యం కారణంగా గత 2017లో చనిపోయింది. అప్పటి నుంచి ఆయన వివవాహం చేసుకోలేదు. పైపెచ్చు.. తన మొదటి కుమార్తె హన్షితకు వివాహం జరిపించారు. అయితే, తండ్రి ఒంటరిగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన కుమార్తె హన్షిత... స్వయంగా రంగంలోకి దిగి ఈ వివాహాన్ని జరిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments