Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి సమాజం ప్రాముఖ్యతను సూచించే నవల ‘అద్భుతం’ను ఆవిష్క‌రించిన దిల్‌ రాజు

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (20:15 IST)
ఒక వ్య‌క్తి.. ఆ వ్య‌క్తికి సంబంధించిన కుటుంబం.. బావుంటే అంద‌రూ బావుంటారా? కొన్ని కోట్లాది కుటుంబాల క‌ల‌యిక వ‌ల్ల ఏర్ప‌డిన ఈ స‌మాజం ఎలా ఉండాలి? ఎలా ఉంటే బావుంటుంది? మ‌న భావిత‌రాల‌కు మంచి స‌మాజాన్ని మ‌నం ఇస్తున్నామా? ఇవ‌న్నీ మనం ఆలోచించాల్సిన విష‌యాలు. ఈ ఆలోచ‌న‌ల స‌మాహారంగా రూపొందిన న‌వ‌ల ‘అద్భుతం’. 
 
ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఈ న‌వ‌ల‌ను ఆవిష్క‌రించారు. దిల్‌ రాజుగారి నిర్మాణంలోని రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో రైట‌ర్‌గానూ, డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసిన ఈ న‌వ‌ల‌ను ర‌చించారు. పుస్తకాన్ని ఆవిష్క‌రించిన దిల్‌రాజు రైట‌ర్ వ‌సంత కిర‌ణ్‌ను అభినందించారు.
 
ఈ సంద‌ర్భంగా.. రైట‌ర్ వ‌సంత కిర‌ణ్ మాట్లాడుతూ, ‘‘న‌వ‌ల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు గారికి థాంక్స్‌. సినిమాగా చిత్రీక‌రించాల‌ని ప‌క్కా స్క్రీన్‌ప్లేతో రాసుకున్న కథ ఇది. సినిమాగా రూప‌క‌ల్ప‌న జ‌ర‌గ‌డం కంటే ముందు పుస్త‌కం రూపంలో మ‌న ముందుకు వస్తుంది.
 
ఈ కథను పుస్తక రూపంలో తీసుకు వస్తే బావుంటుందని సూచించి టైటిల్‌ను సూచించిన నా మిత్రుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సత్య కాశీ భార్గవకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నా ప్రయాణంలో నా వెన్నంట ఉండి ఎంకరేజ్ చేసిన మిత్రులు హరి, తిరుపతిలకు కృత‌జ్ఞ‌త‌లు. త్వ‌ర‌లోనే ఈ న‌వ‌ల‌ను సినిమా రూపంలో తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments