Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు విడుద‌ల చేస్తున్న లవ్ టుడే

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (16:07 IST)
Pradeep Ranganathan, Ivanna
ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ల‌వ్ టుడే. ఇవ‌నా హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత దిల్‌రాజు సిద్ధ‌మ‌య్యారు.
 
రోమ్ కామ్ మూవీగా రూపొందిన ల‌వ్ టుడే సినిమాను దిల్ రాజు తెలుగులో విడుద‌ల చేయ‌నుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. న‌వంబ‌ర్ మూడో వారం తెలుగు రాష్ట్రాల్లో ల‌వ్ టుడే సినిమా భారీ విడుద‌ల చేయ‌టానికి దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
2019లో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన కోమాలి సినిమాను ప్ర‌దీప్ రంగ‌నాథ్ తెర‌కెక్కించారు. ల‌వ్ టుడే అయ‌న రెండో సినిమా. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు హీరోగానూ ఆయ‌నే న‌టించారు. త‌మిళంలో గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ల‌వ్ టుడే చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. స‌త్య‌రాజ్‌, రాధికా శ‌ర‌త్ కుమార్ పోషించిన ప్ర‌ధాన పాత్ర‌లు సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారాయి. సినిమా బ‌డ్జెట్ కంటే ప‌ది రెట్లు లాభాన్ని సాధిస్తుంద‌ని కోలీవుడ్ సినీ వ‌ర్గాలంటున్నాయి. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా బాగా క‌నెక్ట్ అయ్యింది.
 
ఎ.జి.ఎస్‌.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ల‌వ్ టుడే చిత్రాన్ని క‌ల్పతి అఘోరాం, క‌ల్పతి ఎస్‌.గ‌ణేష్ నిర్మించారు. మ్యూజిక్ సంచ‌ల‌నం యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments