Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకట్టుకుంటున్న దళపతి విజయ్, రష్మిక మందన్న వారసుడు ఫస్ట్ సింగిల్

Advertiesment
Vijay, Rashmika Mandanna
, శనివారం, 5 నవంబరు 2022 (17:49 IST)
Vijay, Rashmika Mandanna
దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు సంక్రాంతి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటి. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌ టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.
 
ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాపై భారీ బజ్ వుంది. సినిమా పోస్టర్‌ లు కూల్‌ గా, కలర్‌ఫుల్‌ గా కనిపించాయి. ఇందులో విజయ్,  రష్మికల జోడి లవ్లీగా కనిపించింది.
 
ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని పెంచిన మేకర్స్ ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న రంజితమే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ ఈ పాట కోసం ఫుట్‌ట్యాపింగ్ నంబర్‌ ను స్కోర్ చేశారు. ఎమ్ ఎమ్ మానసితో కలిసి విజయ్ స్వయంగా హై బీట్‌, ఎనర్జిటిక్ గా పాడటం అద్భుతంగా వుంది. విన్న వెంటనే ఉత్సాహాన్ని పెంచుతోంది. విజయ్ వాయిస్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది. వివేక్ సాహిత్యం అందించారు
 
విజయ్‌, జానీ మాస్టర్‌ల కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేయడం చూడటం ఎప్పుడూ ట్రీట్‌ గా ఉంటుంది. డ్యాన్స్‌లు ట్రెండీగా, గ్రేస్ ఫుల్ గా  ఉన్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్,  బ్యాక్‌డ్రాప్‌లు వైబ్రెటింగా వున్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో వున్నాయి. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు.
 
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరించిన చిక్లెట్స్ ఫస్ట్ లుక్ ఇదే